గ్రామాల్లోని ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అధికారులు , నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పుంగనూరు , చౌడేపల్లి, సోమల, సదుం, పులిచెర్ల రొంపిచర్ల మండలాలలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ వైద్యాధికారులు గ్రామాల్లో చేసేటువంటి సర్వేకి సహకరించాలని తెలిపారు.