రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మరియు ప్రకాశం జిల్లా ఇన్చార్జి మంత్రి మేరుగా నాగార్జున త్రిపురాంతకంలోని బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయం మరియు త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయాలను గురువారం దర్శించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రికి ఆలయ ఈవో ఈదుల. చెన్నకేశవ రెడ్డి మరియు వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆలయ చరిత్రను ప్రధాన అర్చకులు వివరించారు.