పేదల ఆరోగ్యంపై వైసిపి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. నెల్లిమర్ల మండలం చంద్రమ్మపేటలో గురువారం ఆరోగ్య సురక్ష వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైద్య శిబిరాన్ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఏడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.