ప్రజలకు కార్పొరేట్ వైద్యానికి దీటుగా ప్రభుత్వం వైద్య సేవలు అందించడానికి పెద్దపీట వేసిందని సర్పంచ్ రంజిత్ రెడ్డి అన్నారు. గురువారం తవనంపల్లి మండలం, మల్లకుంట పంచాయతీలో జగనన్నఆరోగ్య సురక్షను ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, తహాసిల్దార్, ఎంపీడీవోలతో కలసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పేద ప్రజల ఆరోగ్యం కోసం11 రకాల ఆరోగ్య సమస్యలకు సంబంధించి శిక్షణ పొందిన వైద్యులచేత ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.