గ్రామాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని నూతన గ్రామ సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన గంగిరెడ్డి హనుమాయమ్మకు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సూచించారు. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో గతంలో జరిగిన ఒప్పందం మేరకు నూతన సర్పంచ్ గా గంగిరెడ్డి హనుమాయమ్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పాల్గొన్నారు.