సిరియాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. హోమ్స్ ప్రావిన్స్‌లోని మిలిటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా మృతి చెందారు. దాదాపు 125 మంది గాయపడ్డారు. సైనిక కళాశాల గ్రాడ్యుయేషన్ వేడుక జరుగుతున్న సమయంలో ఈ దాడి జరగ్గా.. చనిపోయిన వారిలో మిలిటరీ క్యాడెట్స్ కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. సాయుధ ఉగ్ర సంస్థలే ఈ దాడికి పాల్పడినట్లు సిరియా మిలిటరీ ఆరోపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa