ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ నేడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. హోంశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. అనంతరం అమిత్‌షాతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నారని సమాచారం. కాగా, రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన సీఎం జగన్‌కు గురువారం వైసీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు.