ఇండో అమెరికన్ విద్యార్ధి అతుల్ రావు పల్మనరీ ఎంబోలిజం వ్యాధితో బాధపడుతున్నాడు. అతను అమెరికా టెక్సాస్ లోని బేలార్ యూనివర్సిటిలో చదువుతున్నాడు. తనకున్న వ్యాధి వల్ల రక్తం సరఫరా కాక గుండె ఆగిపోయేది. ఒకరోజు ఏకంగా ఆరుసార్లు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. దీంతో వెంనటే అతుల్ కు లండన్ లోని ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్టు ఇంపీరియల్ హెల్త్ కేర్ లో శస్త్ర చికిత్స చేయించడంతో కోలుకున్నాడు. ఆరుసార్లు గుండె ఆగినా బతకడం చర్చనీయాంశంగా మారింది.