ఏపీలోని తిరుపతిలో గురువారం అర్దరాత్రి జంట హత్యలు జరిగాయి. మహారాష్ట్ర నాందేడ్ కు చెందిన యువరాజు తన భార్య మనీషా, బావమరిది హర్షవర్దన్ ను దారుణంగా హత్య చేశాడు. ఓ ప్రైవేట్ లాడ్జిలోని రూం నంబర్ 302 లో ఈ దారుణం జరిగింది. ఆ తర్వాత యువరాజు తన ఇద్దరు పిల్లలను తీసుకొని పోలీసుల ముందు లొంగిపోయాడు. హర్షవర్దన్ బావమరిదా లేక ఏదైనా సంబంధం ఉన్న వ్యక్తా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.