అక్టోబర్ 8న వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, భారత్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కు మంచి ఫామ్ లో ఉన్న శుభమన్ గిల్ ఆడతాడా లేదా అనే సందేహంగా మారింది. గిల్ డెంగీ బారిన పడ్డాడని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో శనివారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఆడేది లేనిది నిర్ణయిస్తారు. మంచి ఫామ్ లో ఉన్న గిల్ ఆడకపోతే భారత్ కు పెద్ద షాకేనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.