గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని మూడో వార్డు సపోటా తోటలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను గురువారం సాయంత్రం అర్బన్ సీఐ అల్తాఫ్ హుస్సేన్ నేతృత్వంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3100 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. త్వరలో వీరిని కోర్టుకు హాజరు పరుస్తామని సీఐ అల్తాఫ్ హుస్సేన్ మీడియాకు తెలిపారు.