ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో అక్టోబర్ 4 నుంచి 6 వరకు సమావేశమైన ఆర్బీఐ ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటును 6.50 శాతం వద్దనే యథాతథంగా కొనసాగించనున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించడం ఇది నాలుగోసారి.