ఆటోచోరీ జరిగిన ఘటనపై గురువారం కేసు నమోదైంది. సిరిపురానికి చెందిన నక్కా రాజశేఖర్ పది నెలల క్రితం పాత ఆటో కొనుక్కొని దాన్ని నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గత నెల 22వ తేదీ బాడుగ నిమిత్తం సిరిపురం నుంచి గుంటూరు బయలుదేరారు. దారి మధ్యలో ఆటో మరమ్మతుకు గురై ఆగడంతో దాన్ని అక్కడ నిలిపి ఇంటికి వెళ్లారు. ఉదయం వచ్చి చూడగా వాహనం కనిపించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.