తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు సరికాదు. దీనిని మేం ఖండిస్తున్నాం. కేసు ప్రస్తుతం కోర్టులో ఉన్నందున, దీనిపై ఎక్కువ మాట్లాడలేను’’ అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. స్టీల్‌ప్లాంటు పరిరక్షణ కోసం గురువారం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొనేందుకు గురువారం ఆయన విశాఖపట్నం విచ్చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ వైఖరిలో స్పష్టత లేదన్నారు.