ప్రజలవద్దకే నేరుగా వెళ్లి ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకునే గొప్ప కార్యక్రమం గడపగడపకు మన ప్రభుత్వమని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ అన్నారు. శుక్రవారం ముత్యాలపాలెంలో ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంకా అర్హులకు పథకాలు అందకపోతే సచివాలయ సిబ్బందికి తెలియజేయాలని కోరారు.