రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకు సీఎం వైయస్ జగన్ ఢిల్లీ వెళ్లారని , కానీ టీడీపీ నేతలు తప్పుడూ ప్రచారమే చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులను వైయస్ జగన్ ఎక్కువ తెచ్చారని అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రాథమిక ఆధారాలతో చంద్రబాబును కోర్టు జైల్లో పెట్టిందన్నారు. చంద్రబాబు కేసులతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. స్కిల్ స్కామ్ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని, చంద్రబాబు ఖాతాల్లోకే స్కాం డబ్బులు వెళ్లినట్లు సీఐడీ చెప్పిందని తెలిపారు. ఈ స్కామ్‌లో లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేష్ పాత్ర కీలకంగా ఉందన్నారు. అన్ని తప్పులు వారే చేసి సీఎం వైయస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ స్కామ్ గురించి టీడీపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, ఎల్లోమీడియా దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జడ్జీలను, న్యాయవాదులను ఇష్టానుసారంగా దూషిస్తున్నారు. వారి ఫ్రస్టేషన్ పీక్ స్టేజ్‌కు చేరిందని ఫైర్ అయ్యారు.