విశాఖలో మద్యం సేవించి వాహనాలను నడుపుతూ పోలీసులకు పట్టుబడిన వారికి న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా పోలీసులు ప్రతిరోజూ డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వివిధ స్టేషన్ల పరిధిలో సోమ, మంగళవారాల్లో పట్టుబడిన మందుబాబులపై పోలీసులు కేసులు నమోదుచేశారు. గురువారం వారిని కోర్టులో హాజరుపరచగా పలువురికి జరిమానా, జైలు శిక్ష విధించారు.