వైసీపీ ప్రభుత్వం బడుగుల ఉన్నతికి కృషి చేస్తోందని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. వమరవిల్లి గ్రామ పంచాయతీ లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. గడిచిన అనేక దశాబ్దాల నుంచి నెలకొన్ని ఉన్న సమస్యలు తీర్చాం. ఏమీ లేని నిర్భాగ్యులకు భవిషత్ పై ఆశావహ దృక్పథాన్ని పెంపొందింపజేశాం. ఇందుకు కారణం నాలుగున్నర ఏళ్ల క్రితం మీరు ఎన్నుకున్న వైయస్ఆర్సీపీ ప్రభుత్వం. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకూ ప్రభుత్వం తరఫున మాకు ఏమీ దక్క లేదు అని నిరాశలో వెళ్లిపోయిన వారికి భరోసా ఇచ్చాం. ఇవాళ మా ఇంటి వద్దకు నీరు వచ్చింది.మాకు ఇల్లు వచ్చింది. అని మీరంతా అంటున్నారు. సంతోషం. మా పిల్లాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు, మాకు ఏం జరిగినా ఈ ప్రభుత్వం ఉంది అన్న ధైర్యం ఉంది అని చెప్పగలుగుతున్నారు.ఇదంతా మీరు ఎన్నుకున్న మీరు ఓటేసి గెలిపించిన ప్రభుత్వం వల్లే సాధ్యం అయిందని మరొక్కసారి విన్నవిస్తున్నాను అని తెలియజేసారు.