సీఎం జగన్ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ రంగానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో విద్యుత్ రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డితో చర్చించానన్నారు. ఏపీలో విద్యుత్ రంగం పనితీరుపై కేంద్రం సంతృప్తిగా ఉందని స్పష్టంచేశారు. రీ వ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్)కు ఏపీ క్వాలిఫై అయిందని తెలిపారు.