కురుపాం అటవీశాఖ రేంజ్ పరిధిలోని ఇటిక గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది గురువారం తెలిపారు. కావున సమీప ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న ఏడు ఏనుగుల గుంపు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్తున్నారు. పంట పొలాలకు వెళ్లాలంటే భయం వేస్తుందని రైతులు వాపోతున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపును తరలించాలని కోరుతున్నారు.