దుర్గి మండల కేంద్రమైన దుర్గిలో శుక్రవారం స్వచ్ఛత హి సేవలో భాగంగా ప్రిన్సిపల్ ఆకుల ఆశాజ్యోతి ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్రమదానం, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆశాజ్యోతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సామాజిక బాధ్యతగా శ్రమదానం ద్వారా మన ప్రాంతాలను స్వచ్చంగా ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలోని చెత్తను తొలగించి పరిశుభ్రంగా మార్చారు.