నూజివీడు మండలం పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామ శివారు దంతులవారిగూడెం నందు గురువారం రాత్రి పేకాట శిబిరంపై దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకొని 14 వేల రూపాయలు నగదు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై తలారి రామకృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.