స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో.. టీడీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా అక్టోబర్ 7న ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. 7వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల వరకూ ఇళ్లలో లైట్లు ఆపి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించడంతో పాటు వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చింది.