ఏపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుందనే దాని పై ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ సంస్థలు సర్వే నిర్వహించాయి. ఇందులో ఏపీలోని 25 ఎంపీ సీట్లలో వైసీపీ 15, టీడీపీ 10 స్థానాలు గెలుస్తుందని తెలిపాయి. కాంగ్రెస్, బీజేపీ ఒకటి కూడా గెలవదని సర్వేలో తేలింది. టీడీపీ 3 స్థానాల నుంచి 10 స్థానాలకు పెరుగుతుందని, వైసీపీ 22 స్థానాల నుంచి 15 స్థానాలకు తగ్గుతుందని తెలిపారు.