అక్టోబర్ 26న గోవాలో 37వ జాతీయ క్రీడలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శుక్రవారం తెలిపారు. రాష్ట్ర క్రీడా మంత్రి గోవింద్‌గౌడ్, భారత ఒలింపిక్ సంఘం జాతీయ క్రీడల సాంకేతిక ప్రవర్తన కమిటీ చైర్మన్ అమితాబ్ శర్మ సమక్షంలో విలేకరులతో మాట్లాడుతూ.. గోవాలో జరిగే ఈవెంట్ ప్రత్యేకతగా ఉంటుందని సావంత్ అన్నారు. అక్టోబర్ 26న సాయంత్రం 6.30 గంటలకు ఫటోర్డాలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మోదీ ఈ క్రీడలను ప్రారంభిస్తారని తెలిపారు. 43 విభాగాలతో కూడిన ఈ ఈవెంట్ పనాజీ, మపుసా, వాస్కో, పోండా, మార్గోవ్ మరియు కోల్వా బీచ్‌లోని 28 వేదికలపై జరుగుతుందని సావంత్ చెప్పారు. 10,000 మందికి పైగా అథ్లెట్లు, వారిలో 49.9 శాతం మంది మహిళలు ఈ గేమ్స్‌లో పాల్గొంటారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గోవాకు చెందిన ఐదు స్వదేశీ క్రీడలు కూడా ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు.