నాలుగు పురుగు మందుల వాడకంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. డైకోఫౌల్, డైనోక్యాప్, మెథోమిల్, మొనోక్రొటోఫాస్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ లిస్టులో మొదటి 3 మందులకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, విక్రయాలు, పంపిణీని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మొనోక్రోటోఫాస్ మందు తయారీకి ఇక నుంచి కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేయబోమని తెలిపింది.