తమిళనాడులోని తిరుచ్చిలో దారుణ ఘటన కలకలం రేపుతోంది. ఓ బాలిక తన స్నేహితుడితో కలిసి వెళుతుండగా.. మద్యం మత్తులో నలుగురు పోలీసులు అడ్డగించారు. విచారణ పేరుతో తీసుకెళ్లి ఆ స్నేహితుడిపై దాడి చేశారు. ఆ తర్వాత బాలికపై నలుగురు పోలీసులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసింది.. ఈ కేసులో శశికుమార్, శంకరపాండి, ప్రసాద్, సిద్ధార్థ్ అనే పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa