సనాతన ధర్మంపై మాట్లాడటం ఆపే ప్రసక్తే లేదని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తేల్చిచెప్పారు. చెన్నైలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “సనాతనంపై గతంలో పెరియార్, అంబేద్కర్ సహా ఎందరో మాట్లాడారు. మణిపూర్ సమస్య నుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఈ అంశంపై దృష్టి పెట్టింది. అయినా సరే నేను మాట్లాడుతూనే ఉంటా" అని అన్నారు.