ఏపీలోని వైఎస్సార్ జిల్లా కేంద్రంలోని ముస్లింకోట ప్రాంతానికి చెందిన షేక్ గౌసియాబేగంకు ఇద్దరు కూతుర్లు. గౌసియా భర్త 10 సంవత్సరాల క్రితం మరణించాడు. గౌసియాకు అదే ప్రాంతానికి చెందిన సుబహాన్ అనే యువకునితో ఎఫైర్ ఏర్పడింది. సుబహాన్ గౌసియా పెద్ద కూతురుని తనకిచ్చి పెళ్లి చేయాలని ఆమెను వేధించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో సుబహాన్ గౌసియాను హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.