అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిక్కుల్లో పడ్డారు. ఆ దేశ సున్నిత సమాచారాన్ని ఆయన లీక్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. నేవీ సబ్మెరైన్స్, న్యూక్లియర్ వార్ హెడ్స్ సంఖ్య, రష్యా నౌకలను అవి ఎంత త్వరగా చేరుకోగలవు? అనే సమాచారాన్ని ఆస్ట్రేలియా బిలియనీర్ ఆంథోనీ సహా పలువురు స్నేహితులకు అందించినట్లు 'న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది. దీనిపై పూర్తిగా తెలుసుకునేందుకు బైడెన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.