అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమ, అభివృద్ధి, రక్షణకు ప్రాధాన్యమివ్వాలని దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రాష్ట్ర కార్యదర్శి ఎ.దేవకుమార్ అన్నారు. దళిత ఆదివాసి మేనిఫెస్టో- 2024 అంశంపై నరసరావుపేటలో జిల్లాస్థాయి సదస్సు శుక్రవారం జరిగింది.దేవకుమార్ మాట్లాడుతూరాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండాలన్నారు.