వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. వినుకొండ పట్టణంలో శుక్రవారం రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి అనే అంశంపై కార్యకర్తలకు, సచివాలయ కన్వీనర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. కన్వీనర్లు ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల దృష్టికి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు కొనసాగింపు వైసీపీతోనే సాధ్యమన్నారు.