గుంటూరు పట్టణం ఆనందపేటకు చెందిన షాంషీద్ కు కలకత్తాకు చెందిన రాజు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు తన దగ్గర సౌదీ కరెన్సీ ఉందని చెప్పడంతో షాంషీద్ గత నెల 24న రాజు వద్దకు వెళ్లి రూ. 4.50 లక్షలు ఇచ్చాడు. డబ్బును ఇంట్లో పెట్టి వస్తానంటూ చెప్పి రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. షంషీద్ తాను మోసపోయినట్లు గుర్తించి శుక్రవారం పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.