రాజాం నియోజకవర్గం నుండి గత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన కంబాల జోగులు సీఎం కు వీర విధేయుడిగా కొనసాగారని వై. వి. సుబ్బారెడ్డి శనివారం అన్నారు. సౌమ్యుడు, అందరివాడిగా పేరుందిన కంబాల జోగులు అంటే పార్టీ అధిష్టానానికి ప్రత్యేక అభిమానమని, వచ్చే ఎన్నికల్లో జోగులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సుబ్బారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజాం బరిలో కంబాల జోగులే ఉండనున్నారనే సంకేతాలను ఇచ్చారు.