పాలిస్తానీ హమాస్ టెర్రరిస్టు గ్రూపు రాకెట్ దాడులతో ఇజ్రాయెల్ లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది భవనాలు మంటల్లో చిక్కుకుపోయాయి. ఎక్కడ చూసినా దట్టమైన పొగ అలుముకుంది. తాము ఇప్పటికే 50కిపైగా ఇజ్రాయెల్ పౌరులను హతమార్చామని..30 మందిని బందీలుగా తీసుకున్నామని హమాస్ గ్రూపు ప్రకటించింది. రాకెట్ దాడుల్లో 100 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ దళాలు పనిచేస్తున్నాయి.