నకిలీ బంగారం విక్రయించి మోసగించిన వైనంపై బాధితులు ఫిర్యాదు చేశారు. బళ్లారిలో పొలం దున్నుతుంటే బంగారం బయట పడిందని, తక్కువ ధరకు అమ్ముతామంటూ మోసగాళ్ల ముఠా గుంటూరు పట్టణంలో పలువురిని నమ్మించి రూ. 10 లక్షలు తీసుకొని ఉడాయించింది. బాధితులు ఆ బంగారు నాణేలను పరీక్షించుకోగా నకిలీ అని తేలడంతో లబోదిబోమంటూ శనివారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa