టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నంద్యాల జిల్లా, చిన్న దేవులాపురం నుంచి రాజమహేంద్రవరానికి టీడీపీ కార్యకర్త చింతల నారాయణ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 5వ తేదీన పల్నాడు జిల్లా, వినుకొండ సమీపంలో అతనిపై కొందరు దాడి చేసి గాయపరిచారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకున్న నారాయణ మళ్లీ పాదయాత్ర చేపట్టారు. శావల్యాపురంలో ఆయనను టీడీపీ నాయకులు సన్మానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa