రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మధ్యాహ్న భోజనం పథకం కోసం వంట పాత్రలు అందించనున్నట్లు వెల్లడించింది. 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 80 వేల మంది మధ్యాహ్న భోజన సిబ్బందికి నాణ్యమైన స్టీల్ గిన్నెలు ఇవ్వనున్నట్లు తెలిపింది. కాగా, మధ్యాహ్న భోజనం పథకం ద్వారా రోజూ 40 లక్షల మంది విద్యార్థులకు ఆహారం అందిస్తున్నారు.