బొగ్గు గని కార్మికులకు కోల్ ఇండియా యాజమాన్యం శుభవార్త చెప్పింది. వారికి ప్రొడక్షన్ లింక్ రివార్డ్ (పీఎల్ఆర్) దీపావళి బోనస్‌ను ప్రకటించింది. కోల్ ఇండియా పరిధిలోని సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు.. ఒక్కో కార్మికుడికి రూ.85 వేల చొప్పున బోనస్‌గా చెల్లించనున్నట్లు ఆదివారం వెల్లడించింది. కాగా, గతేడాది దీపావళి బోనస్‌గా రూ.76,500 చెల్లించారు.