ఎక్స్ ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మేనేజర్లకు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రాలు అందజేశారు. అందులో భాగంగా కోసిగి రైల్వే స్టేషన్ మేనేజర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఏఐవైఎఫ్ తాలుకా ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు కోట్లాది మంది రైళ్లలోనే ప్రయాణం చేస్తున్నారని, రైల్వే శాఖ కూడా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.