ఎల్లెల్సీకి డిసెంబర్ ఆఖరి వరకు సాగునీరు విడుదల చేయాలని సోమవారం పెద్దకడబూరులోని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నేతలు పరమేష్, తిక్కన్న మాట్లాడుతూ ఎల్లెల్సీ కింద సాగు చేసిన వరి పంట డిసెంబరులో రైతుల చేతికి అందుతుందని, అప్పటి వరకు సాగునీరు విడుదల చేయాలని, ఖరీఫ్ లో దెబ్బతిన్న పంటలను నష్టపరిహారం ఇవ్వాలని తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ కు వినతిపత్రం అందజేశారు.