మంత్రి ఆర్కే రోజాపై తమ పార్టీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు స్పందించడంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి సినీ ప్రముఖులకు ఏం తెలుసని, ఒకప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భార్యను అన్నప్పుడు మీరెక్కడికి వెళ్లారని ఆమె ప్రశ్నించారు. రోజా చరిత్ర ఏమిటో తెలుసుకొని మాట్లాడాలని ఆమె హితువు పలికారు.