క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం హోంగార్డ్స్ తో కమాండెంట్ దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలని హోంగార్డ్ దైనందిన విధులు సవాళ్లతో కూడుకున్నది అన్నారు.