విజయవాడ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజా ప్రతినిధులు సదస్సు కు సోమవారం పెనుకొండ నియోజకవర్గంకు చెందిన రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర, పెనుకొండ పట్టణ వైసీపీ కన్వీనర్ బోయ నరసింహులు, పెనుకొండ మున్సిపల్ వైస్ చైర్మన్ బోయ సునీల్, గోరంట్ల ఎం. పి. పి భర్త నరసింహమూర్తి తదితరులు హాజరయ్యారు. అదేవిధంగా నియోజకవర్గంలోని మండలాలకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.