మడకశిర పట్టణంలోని ప్రభుత్వ సోమవారం ఆర్డిటి ఆధ్వర్యంలో జరుగుతున్న అనంత ప్రీమియర్ లీగ్ అండర్ 15 బాలుర క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా మడకశిర ధర్మవరం జట్టు తలబడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ధర్మవరం జట్టు 458 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మడకశిర జట్టు 19 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ధర్మవరం జట్టు భారీ పరుగులు తేడాతో గెలవడంతో ఆ జట్టు క్రీడాకారులను సంఘం సభ్యులు అభినందించారు.