ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృధ్ది-సంక్షేమం రెండు కళ్ళుగా ప్రభుత్వం కొనసాగిస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 09, 2023, 04:15 PM

జగనన్న ముఖ్యమంత్రిగా కొనసాగడం ఐదుకోట్ల మంది ప్రజలకు చారిత్రాత్మక అవసరం అని మంత్రి జోగి రమేష్ అన్నారు. జగన్ గారిని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని అన్నారు. అభివృధ్ది-సంక్షేమం రెండు కళ్ళుగా ప్రతి గ్రామాన్ని అభివృధ్ది చేస్తున్న ఘనత శ్రీ వైయస్ జగన్ దని అన్నారు. భారత దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తలపెట్టని విధంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూనే జగనన్న ఆరోగ్యసురక్షను తీసుకువచ్చారని అన్నారు. ఇది పేదవాడి ఆయుష్యును పెంచే ఆలోచన అన్నారు. ఇది గొప్ప ఆలోచనా పరుడు చేసే కార్యక్రమం అని కొనియాడారు. అవినీతి పరుడైన చంద్రబాబు ప్రజల కోసం పోరాటం చేసి జైలుకు వెళ్లినట్లుగా తెలుగుదేశం,ఎల్లోమీడియా ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని తెలియచేశారు. ప్రతిపక్షనేతలు,పార్టీలు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా,పొర్లాడినా ప్రజలు గెలిపించేది శ్రీ వైయస్ జగన్ నే అనేది గుర్తించాలన్నారు. 175 స్దానాలలో వైయస్సార్ సిపి విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com