పార్వతీపురం ఔట్‌పోస్ట్ పోలీసులు, కొమరాడ ఎస్ఐ జగదీష్‌నాయుడు తెలిపిన వివరాల మేరకు మండలంలో అంటివలస గ్రామానికి చెందిన మెల్లిక మురళీ గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు. సోదరుడితో కలిసి వరిపంటకు పురుగుమందు కొట్టిన అనంతరం మిగిలిన మందును డ్రింక్బాటిల్లో వేసి ఉంచారు. పురుగుమందును మద్యం అనుకుని తాగాడు. అస్వస్థతకు గురై వాంతులవడంతో గుర్తించిన కుటుంబసభ్యులు, 108లో కేంద్రాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు.