శ్రీసత్యసాయి జిల్లా, పెనుకొండ వైసీపీ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ కారుపై దుండగులు బాంబు దాడి చేశారు. బాంబు పేలకపోవటంతో ప్రమాదం తప్పింది. గోరంట్ల మండలం గడ్డం తాండాలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ్ తన సిబ్బందితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. దుండగులు బాంబులు విసిరారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి ఓ నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నారాయణపై ఎలక్ట్రికల్ డిటోనేటర్ విసిరినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పవర్ సప్లై లేకపోవడం వల్ల అది పేలలేదని గుర్తించారు. మద్యం మత్తులో డిటోనేటర్ విసిరినట్లు భావిస్తున్నామని గోరంట్ల సీఐ సుబ్బరాయుడు స్పష్టం చేశారు.. దుండగుడి పేరు గణేష్ గా గుర్తించామని పేర్కొన్నారు. నిందితునిది సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంగా గుర్తించామని,. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని గోరంట్ల సీఐ సుబ్బరాయుడు స్పష్టం చేశారు.