కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగాలి. కేంద్ర నిర్ణయంపై విధివిధానాలతో గెజిట్ విడుదలైన నేపథ్యంలో మరోసారి ప్రధాని, హోం మంత్రులకు లేఖలు రాయలి’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయ నిపుణులతో జగన్ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఎలా అన్యాయం జరుగుతోందోనని పలు విషయాలు అధికారులు సీఎంకు వివరించారు.