రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడవ స్థానంలో ఉందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటమయ్య పేర్కొన్నాడు. సోమవారం హిందూపురం పట్టణంలోని కొట్నూరు కమ్యూనిటీ భవన్లో ఏపి రైతు సంఘం జిల్లా సమితి కెవి చలపతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన రైతు సంఘ మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ప్రతి రైతు మీద రూ. 2. 45 లక్షల రుణభారం ఉందన్నారు.